ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం వెంకటాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందారు. గ్రామంలో ఓ వ్యక్తి భవనానికి పైకప్పు రేకులు వేసేందుకు సమీపంలోని పొలంలో వ్యవసాయ పని చేసుకుంటున్న మంచాల గణపతి(55) అనే కూలీని సాయం చేసేందుకు పిలిచాడు.
గణపతి పొలంలోనుంచి వచ్చి పైకప్పు రేకులు అందిస్తుండగా భవనానికి ఆనుకొని ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు ఇనుప పైపులు తగిలాయి. గణపతి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. గణపతికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.