హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట-నాగోల్ ప్రధాన రహదారిపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. నాగోల్ నుంచి కొత్తపేట వైపు వెళుతోన్న ఓ కారు.. ఎదురుగా వస్తోన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో బైక్పై వెళ్తున్న రాఘవేందర్ అనే ఓ మైనర్ బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. హేమంత్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కారు డ్రైవర్ సురేశ్ బాబును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఓ ప్రభుత్వ ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.