కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లికి చెందిన ఆడెపు రాజగోపాల్ అనే యువకుడు సోమవారం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపాడు. సాయంత్రం స్నేహితులకు విందు ఇద్దామని ఇల్లందుకుంట మండలం మల్యాలలో కల్లు తాగేందుకు వెళ్లారు. విందు చేసుకుంటున్న సమయంలో పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో రాజగోపాల్ ప్రమాదవశాత్తు సమీపంలోని బావిలో పడి మృతి చెందాడు.
స్నేహితుల సమాచారం మేరకు బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. పుట్టినరోజునే మరణించటం వల్ల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:- జనరేటర్ ద్వారా ఇంట్లోకి విషవాయువు-వ్యక్తి మృతి