ETV Bharat / jagte-raho

విషాదం: విద్యుత్​ కంచె తగిలి ఓ వ్యక్తి మృతి - మహబూబ్​నగర్​ జిల్లాలో విద్యుత్​ కంచె తగిలి ఓ వ్యక్తి మృతి

పొలంలో అడవి పందుల కోసం వేసిన కంచె తగిలి విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మహబూబ్​నగర్​ జిల్లా చక్రపురంలో చోటుచేసుకుంది.

one person dead with electric shock in mahabubnagar district
విషాదం: విద్యుత్​ కంచె తగిలి ఓ వ్యక్తి మృతి
author img

By

Published : Oct 11, 2020, 8:40 PM IST

మహబూబ్​నగర్ జిల్లా ముసాపేట మండలం చక్రపురంలో విద్యుతాఘాతంతో యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన యాదయ్య వరిపొలంలో అడవి పందుల కోసం కంచె ఏర్పాటు చేసి కరెంట్ పెట్టాడు. ఉదయం పందులు పడ్డాయని వాటిని తీసుకొద్దామని యాదయ్య, రాములు, రమేష్, రాఘవేందర్ గౌడ్ (33)తో కలిసి వెళ్లాడు.

అక్కడ ప్రమాదవశాత్తు రాఘవేందర్ గౌడ్ కంచెకు తగలడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై గోపాల్ నాయక్ తెలిపారు. రాఘవేందర్ గౌడ్ పెయింటర్​గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు బంధువులు తెలిపారు. అతని మరణవార్త విన్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇదీ చూడండి: డివైడర్​ను దాటి... గాల్లో ఎగిరి... బైక్​ను ఢీకొట్టింది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.