జోగులాంబ గద్వాల్ జిల్లా కోస్గికి చెందిన భూపాల్, కంచిరావుపల్లికి చెందిన లింగేశ్ ఇద్దరు హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఐజ మండలం పులికల్లో బంధువు అంత్యక్రియలు ముగించుకుని తిరిగి హైదరాబాద్కు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఇటిక్యాల మండలం యాక్తపూర్ దగ్గర జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం వీరి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో భూపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన లింగేశ్ను కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఐజ ఎస్సై తెలిపారు.
ఇదీ చూడండి:- 'కరోనా వేళ ఎన్నికల నిర్వహణకు సూచనలు ఇవ్వండి'