ఈ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి.
స్కూటీని తప్పించబోయి ఆటోకు ఢీ.. యువకుడు మృతి - hyderabad accident news
ద్విచక్ర వాహనంపై అతివేగంతో వస్తున్న ఇద్దరు యువకులు.. ఎదురుగా వస్తున్న స్కూటీని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించగా... మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.
స్కూటీని తప్పించబోయి ఆటో కింద పడ్డి ఒకరు మృతి
హైదరాబాద్ పాతబస్తీ షాలిబండ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇద్దరు యువకులు స్కూటీపై వస్తూ... ఎదురుగా వస్తున్న వాహనాన్ని చూసి ఒక్కసారిగా బ్రేక్ వేశారు. ఈ క్రమంలో వాహనం కింద పడగా... అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఆటో వెనుకభాగం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి.
ఇదీ చూడండి: గర్భవతి అని చూడకుండా కోడలిని హింసించిన అత్త!