నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామ సమీపంలో నిర్మల్ - ఆదిలాబాద్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నిర్మల్ మండలం ఎల్లపల్లి గ్రామానికి చెందిన గంగారం మృతి చెందాడు. నూతనంగా కొనుగోలు చేసిన స్కూటీ రిజిస్ట్రేషన్ కోసం చించోలి (బి) గ్రామ సమీపంలోని రవాణా శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని తిరుగు ప్రయాణంలో స్థానిక పెట్రోల్ బంక్ వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాడు.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన గంగారాంను నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా... మార్గమధ్యలో మృతి చెందాడు. లక్ష్మణచందా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గంగారం... రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.