ETV Bharat / jagte-raho

పండగకు బట్టలు కొనేందుకు వెళ్లి... అనంతలోకాలకు... - ఆటోనగర్​ రోడ్డు ప్రమాదం

దీపావళి పండగ కోసం బట్టలు కొనుక్కునేందుకు ఉత్సాహంగా వెళ్లిన యువకుడిని లారీ రూపంలో మృత్యువు ఎదురైంది. ప్రమాదవశాత్తు రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనటం... యువకుడు రోడ్డుపై పడటం... అదే సమయంలో లారీ రావటం... ఆ యువకునిపై నుంచి దూసుకెళ్లటం... ప్రాణాలు పోవటం.. అంతా చూస్తుండగానే జరిగిపోయింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్​ ఆటోనగర్​లో జరిగింది.

పండగకు బట్టలు కొనేందుకు వెళ్లి... అనంతలోకాలకు...

author img

By

Published : Nov 12, 2020, 3:19 PM IST

వెలుగుల దీపావళి పండగ వేళ ఓ కుటుంబంలో చీకటి నిండింది. ఉత్సాహంగా వెలుగుతున్న ఆ ఇంటి దీపం ఆరిపోయింది. పండగకు బట్టలు కొనుక్కునేందుకు వెళ్లిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్​ హయత్​నగర్​కు చెందిన బన్నీ అనే యువకుడు దీపావళి పండుగ కోసం బట్టలు కొనుక్కోవడానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఆటోనగర్​ వద్ద ప్రమాదవశాత్తు రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బన్నీ రోడ్డు మీద పడిపోయాడు.

అదే సమయంలో లారీ రావటం... బన్నీపై నుంచి దూసుకెళ్లిపోవటం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ ప్రమాదంలో బన్నీ అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా.... ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపు విజయవాడ జాతీయరహదారిపై ట్రాఫిక్​జామైంది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు... విగతజీవిగా రోడ్డుపై పడి ఉండటాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: బైక్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.