ETV Bharat / jagte-raho

గంటన్నరలో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - మేడ్చల్ జిల్లా నేర వార్తలు

అక్కా, తమ్ముడు హాయిగా తమ ఇంటి సమీపంలో ఆడుకుంటుంన్నారు. ఇంతలో ఓ అపరిచితురాలు అక్కడికి వచ్చింది. బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి పంపింది. బాలుడిని కిడ్నాప్ చేసింది. కొద్ది క్షణాల్లోనే ఈ తతంగమంతా జరిగిపోయింది. వెంటనే విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసు బృందం గంటన్నరలోనే కేసును ఛేదించి ఔరా అనిపించింది.

one-boy-kidnapped-in-medchal-district-and-that-kidnap-case-solved-in-2-hours
గంటన్నరలో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
author img

By

Published : Dec 25, 2020, 5:30 PM IST

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలో బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో గంటన్నరలోనే ఈ కేసును పోలీసులు ఛేదించారు. గాంధీనగర్‌కు చెందిన శ్రీకాంత్, మంగ కుమారుడు రాధాకృష్ణ 15 నెలల బాలుడు. అతను తన అక్కతో కలిసి తమ ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా పద్మ అనే మహిళ అక్కడికి వచ్చింది. బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి పంపింది. అనంతరం బాలుడిని కిడ్నాప్ చేసింది.

ఆరు బృందాలుగా..

కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన ఆరు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. బాలుడితో మాట్లాడిన మహిళ ఆనవాళ్లను స్థానికులు పోలీసులకు తెలిపారు. ఆ మహిళ కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. షాపూర్‌నగర్ రహదారిపై వెళ్తున్న పోలీసు వాహనం చూసి పక్కనే ఉన్న ఓ గల్లిలోకి పద్మ వెళ్లడాన్ని పోలీసులు గమనించారు. బాలుడుతో సహా ఆమెను పట్టుకున్నారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.

ఆ మహిళ ఎందుకు కిడ్నాప్ చేసిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని జగద్గిరిగుట్ట వాసిగా గుర్తించారు. ఫిర్యాదు అందిన గంటన్నరలో పోలీసులను ఛేదించడం పట్ల కుటుంబసభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: అనుమానస్పద స్థితిలో మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.