ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని పాత ఇల్లు కూలుతున్నాయి. నిన్న ఒక్కరోజే నగరంలో పదుల సంఖ్యలో నేలమట్టమయ్యాయి. ఖిలా వరంగల్ పడమర కోటలో ఇల్లు కూలి వెంకటేశ్వర్లు అనే వృద్ధుడు దుర్మరణం చెందాడు.
అప్రమత్తమైన బల్దియా అధికారులు... పాత భవనాలను వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఏడు వందలకు పైగా పాత ఇళ్ల యజమానులకు నోటీసులు అందజేసినట్టు బల్దియా పట్టణ ప్రణాళిక అధికారులు తెలిపారు.