ETV Bharat / jagte-raho

అమ్మకి గుండెపోటని వెళ్లాడు... కన్పించకుండాపోయాడు

ప్రేమించాడు... పెళ్లి చేసుకున్నాడు. బతుకుదెరువు కోసం భార్యతో కలిసి వచ్చాడు. పటాన్​చెరు పారిశ్రామిక వాడలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. స్థానికంగా ఓ పరిశ్రమలో పనికి కుదిరాడు. రోజూలాగే ఈనెల 25న విధులు నిర్వహిస్తుండగా ఫోన్ రావడంతో అక్కడినుంచి వెళ్లి... అదృశ్యమయ్యాడు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

missing
missing
author img

By

Published : Sep 30, 2020, 7:33 AM IST

Updated : Sep 30, 2020, 7:59 AM IST

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. జీవనోపాధి కోసం భార్య సమేతంగా సంగారెడ్డి జిల్లా పటాన్​చెరుకు వచ్చాడు. ఓ పరిశ్రమలో పనికి కుదిరాడు. రోజూలాగే విధులకు వెళ్లిన వ్యక్తి ఫోన్ రావడంతో అదృశ్యమయ్యాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగత్ రావు పేటకు చెందిన కార్తీక్ అనే యువకుడు అశ్విని అనే యువతిని ప్రేమించి... వివాహం చేసుకున్నాడు. వీరు తొలుత కొంపల్లిలో నివాసం ఉన్నారు. 12 రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు భగత్ కాలనీకి మకాం మర్చారు. లక్డారం కూడలి సమీపంలోని ఓ పరిశ్రమలో తాత్కాలిక కార్మికుడిగా పనికి కుదిరాడు.

తల్లికి గుండెపోటని...

రోజూలాగే ఈనెల 25న విధులకు వెళ్తున్నానని భార్యకు చెప్పి పరిశ్రమకు వెళ్ళాడు. పనిచేస్తుండగా ఉదయం ఎనిమిది గంటలకు ఫోన్ రాగా... తన తల్లికి గుండెపోటు వచ్చిందని కాంట్రాక్టర్ వద్ద రూ.500 తీసుకుని వెళ్ళిపోయాడు. సెక్యూరిటీ ఏఎస్ఓ రమేష్ ఈ విషయాన్ని కార్తీక్ బావమరిది దేవేందర్​కి చెప్పాడు. కార్తీక్​కి ఫోన్ చేయగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫోన్ రింగయ్యింది అనంతరం స్విచ్ఛాఫ్ అయింది. కార్తీక్ తల్లిదండ్రులను సంప్రదించినా... ఆచూకీ లభించలేదు. భార్య అశ్విని ఫిర్యాదుతో పటాన్​చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: కేటాయింపుల్లో జాప్యం.. ఎదురుచూస్తున్న నిరుపేదలకు శాపం

Last Updated : Sep 30, 2020, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.