హైదరాబాద్‌లో సైబర్ దొంగలు రెచ్చిపోతున్నారు. పాత బోయిన్‌పల్లికి చెందిన చిందుప్రియకు ఓ ప్రముఖ కంపెనీ పేరిట ఫోన్ చేసి.. ఉద్యోగానికి ఎంపికయ్యారంటూ ప్రాసెసింగ్ ఫీజు 50 వేలు కట్టించుకున్నారు. తర్వాత చరవాణిని స్విచ్ఛాప్ చేసేశారు. బంజారాహిల్స్‌కు చెందిన అమీనుద్దీన్ షారూఖీ...ఓఎల్ఎక్స్లో కారు ప్రకటన చూసి అందులో పేర్కొన్న వ్యక్తికి 60 వేలు ఆన్‌లైన్ బదిలీ చేశాడు. ఆ తర్వాత మోసగాడు ఫోన్ కట్టేశాడు.
అటు చార్మినార్ వాసి హాజీ మస్తాన్ ఖురేషీ ఫోన్‌కు.... 25 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నారంటూ... కౌన్ బనేగా కరోడ్ పతి పేరిట ఓ వీడియో వచ్చింది. బహుమతి కావాలంటే 57 వేలు ట్రాన్స్‌ఫర్ ఫీజు కట్టాలని చెప్పడం వల్ల... ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో జమ చేశాడు. ఆ తర్వాత స్పందన లేదు. షేక్‌పేట్‌కు చెందిన విజయలక్ష్మి చరవాణికి వచ్చిన ఓటీపీ చెప్పడం వల్ల... ఆమె ఖాతాలోంచి 90 వేలు మాయమయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : దీపావళి రోజు ఆ ప్రాంతాల్లో కాలుష్యం పెరిగింది