కామారెడ్డిజిల్లా క్యాసంపల్లి తండాకు చెందిన మలావత్ మహేందర్(22) నాలుగు నెలల కిందట నాగిరెడ్డిపేట మండలం ఎర్రకుంట తండాకు చెందిన శిరీష వివాహబంధంతో ఒక్కటయ్యారు. అన్యోన్యంగా దాంపత్య జీవితం గడుపుతున్న వారు ఉన్నట్టుండి పోచారం జలాశయంలో శవాలై తేలడం అందరిని కలిచివేసింది.
పుట్టింట్లో ఉన్న భార్యను తీసుకొచ్చేందుకు యువకుడు మంగళవారం ఎర్రకుంట తండాకు వచ్చారు. గోపాల్‌పేటకు వెళ్లివస్తామని కుటుంబసభ్యులకు చెప్పి ఇద్దరు కలిసి బుధవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాలేదు. జలాశయం గట్టు వద్ద చెప్పులు, ద్విచక్రవాహనం చూసి అనుమానం వచ్చి వెతకగా శవాలై కనిపించారు అని వారి కుటుంబీకులు తెలిపారు.
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని నాగిరెడ్డిపేట ఎస్సై రాజయ్య అన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.
ఇదీ చూడండి : 'జీవన్మరణ పోరాటంలో విజయం తథ్యం'