ETV Bharat / jagte-raho

నేటితో ముగియనున్న నగేశ్​ కస్టడీ... కీలక ఆస్తుల గుర్తింపు

నర్సాపూర్​ లంచం కేసులో నిందితుడు నగేశ్​ కస్టడీ నేటితో ముగియనుంది. మూడు రోజులుగా నగేశ్​ను ప్రశ్నించిన అధికారులు... పలు బినామీ ఆస్తులను గుర్తించారు. పలు ప్రశ్నలకు సమాధానం దాటవేయగా... చివరి రోజైనా కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

narsapur nagesh bribe case update
narsapur nagesh bribe case update
author img

By

Published : Sep 24, 2020, 11:32 AM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్ లంచం కేసులో నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. అదనపు కలెక్టర్ నగేశ్​, ఆర్డీవో అరుణ రెడ్డితో పాటు మరో ముగ్గురు నిందితులను అవినీతి నిరోధక శాఖ అధికారులు 3 రోజుల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో రూ. కోటి 12 లక్షల లంచం తీసుకున్న నగేశ్​ పైనే అనిశా అధికారులు దృష్టి కేంద్రీకరించారు.

మూడు రోజులుగా నగేశ్​ను ప్రశ్నించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు అతని బినామీ వ్యక్తులను గుర్తించి వారి నుంచి వివరాలు సేకరించారు. హైదరాబాద్​తో పాటు శివారు ప్రాంతాల్లో కూడబెట్టిన బినామీ ఆస్తులను అధికారులు గుర్తించారు. గతంలో నగేశ్​ పనిచేసిన నిర్మల్​తో పాటు మెదక్​లోనూ భూములు కొనుగోలు చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. పలు ప్రశ్నలకు నగేశ్​... సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. చివరి రోజైనా... నగేశ్​ నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి: మూడో రోజు విచారణ.. నగేశ్​ బ్యాంకు లాకర్​ తెరిచే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.