ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొమిరేపల్లిలో.. మూర్ఛతో ఏసుపాదం అనే కౌలురైతు మృతి చెందాడు. పొలంలోని కాలువలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మూడు రోజులుగా.. గ్రామస్థులు వింత వ్యాధితో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బాధితుల కోసం అధికారులు వైద్య శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో.. ఏసుపాదం మృతి చెందిన తీరు స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది.