ఈనెల 17న మేడ్చల్ లేబర్ అడ్డాలో విజయ అనే మహిళ కూలీ పని కోసం నిలుచుంది. ఆమె నగలు ధరించి ఉండటం గమనించిన.. మూసాపేట్‌కి చెందిన రవి.. పని ఉంది అని చెప్పి ఆమెను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. మద్యం సేవించిన రవికుమార్ విజయను లైంగికంగా వేధించి.. చాతిపై నొక్కడం వల్ల ఆమె ఊపిరాడక చనిపోయింది.
మృతదేహాన్ని పక్కనే ఉన్న మేడ్చల్ రైల్వే గేట్ వద్ద పడేసిన రవి.. నగలతో పరారయ్యాడు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రవికుమార్‌ను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై గతంలో మూడు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోసారి రవికుమార్‌ను కస్టడీలోకి తీసుకొని పూర్తి విచారణ చేస్తామని బాలానగర్ డీసీపీ పద్మజ వెల్లడించారు.
ఇదీ చదవండి: ఇద్దరు పిల్లలతో వివాహిత అదృశ్యం