మీర్‌పేటలో క్యాటరింగ్ నిర్వహించే వేలూరి అనితకు నెల్లూరికి చెందిన పేరం నవీన్‌కుమార్‌తో పరిచయం అయింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అనిత తన పెద్ద కుమారై వందనను అతనికిచ్చి గతేడాది చివరిలో వివాహం చేసింది. వీరి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న వందన ఈ ఏడాది మార్చి 13న ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు అనిత, నవీన్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు. మూడు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. అనిత తన మకాంను సికింద్రాబాద్‌లోని పార్సిగుట్టకు మార్చింది. నవీన్ విజయవాడకు వెళ్లిపోవటంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు స్పందించలేదు. రామంతాపూర్ శ్రీనగర్ కాలనీలో నవీన్ ఉంటున్నాడనే విషయం తెలుసుకొని ఈనెల 28న రాత్రి నవీన్ వద్దకు వెళ్లింది. నన్నెందుకు దూరం పెడుతున్నావు.. అంటూ ప్రశ్నించింది. ఇద్దరి మధ్య మాటమాటా పెరిగి గొడవకు దారి తీసింది.
ఆ రాత్రి అతనితో పాటే నిద్రకు ఉపక్రమించినట్లు నటించింది. అతడు నిద్రలోకి వెళ్లాగానే కూరగాయలు తరిగే కత్తితో విచక్షణారహితంగా పొడిచింది. దీంతో నవీన్ అక్కడిక్కనే మృతి చెందాడు. ఉదయం ఉప్పల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసి అనితను న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు ఉప్పల్ సీఐ రంగస్వామి తెలిపారు.
ఇదీ చదవండి: హవాలా డబ్బు తరలిస్తున్న ముఠా అరెస్ట్... రూ.16 లక్షలు స్వాధీనం