ETV Bharat / jagte-raho

జూబ్లీహిల్స్​లో హత్య.. ప్రశ్నించడమే కారణం.. - nims

తన సోదరిని ఎందుకు వేధిస్తున్నారని అడిగిన పాపానికి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు తండ్రీ కొడుకులు. హైదరాబాద్​ జూబ్లీహిల్స్​ పరిధిలోని వీడియోగల్లీలో జరిగిన ఈ హత్య కేసులో నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
author img

By

Published : Mar 13, 2019, 6:25 AM IST

Updated : Mar 13, 2019, 11:32 AM IST

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
తన సోదరిని ఎందుకు వేధింపులకు గురి చేస్తున్నావని అడిగినందుకు ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌ పీఎస్​ పరిధిలో చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీడియోగల్లీలో నివసించే మృతుడు పృథ్వీరాజ్ సోదరిని అదే ప్రాంతానికి చెందిన డేవిడ్ ఆరు నెలలుగా వేధిస్తున్నాడు. ఈ విషయంలో బస్తీ పెద్దలు పంచాయితీ నిర్వహించి డేవిడ్ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి మృతుడి తల్లి రాజమణి నిర్వహించే దుకాణం నుంచి తల్లీకూతుర్లు వస్తుండగా డేవిడ్‌ మరోసారి తీవ్రంగా దూషించాడు. ఈ విషయాన్ని రాత్రి 10 గంటలకు పృథ్వీరాజ్‌కు తెలిపారు. అక్కడికి చేరుకున్న పృథ్వీరాజ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి డేవిడ్‌ ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. ఆ సమయంలో డేవిడ్‌ అతని కుమారుడు ఓసెఫ్‌ వీరిపైకి దూసుకొచ్చి ఒకరినొకరు కిందకు తోసుకున్నారు. డేవిడ్‌ తన వద్ద ఉన్న పదునైన కత్తితో పృథ్వీరాజ్‌ గుండె భాగంలో పొడవటంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు హుటాహుటిన నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధరించారు.

ఇవీ చూడండి: ఎన్నికల వేళ... అప్పుడే కోటి పట్టివేత

Intro:HYD_TG_33_13_HITAM_SPORTS_MEET_AB_C9

Body:మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి గ్రామ శివారులో ఉన్న హితం ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజుల నుంచి స్పోర్ట్ సంగ్రామ్ ఫెస్టివల్ పేరిట క్రీడా పోటీలు నిర్వహించారు. ఇందులో వివిధ కాలేజ్ ల నుంచి 500 మంది విద్యార్థులు కబడ్డీ, వాలిబాల్, బాస్కెట్బాల్ పోటీలను నిర్వహించారు. మంగళవారం జరిగిన ఫైనల్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

Conclusion:బైట్; రాజేశ్, ఫిజికల్ డైరెక్టర్, హితం కాలేజ్
Last Updated : Mar 13, 2019, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.