ఇటీవల కుమురం భీం జిల్లాలో పులి దాడిలో మృతి చెందిన కుటుంబాలను ఎంపీ సోయం బాపూరావు పరామర్శించారు. సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. పెంచికలపేట మండలం కొండపల్లి, దహేగం మండలం దిగిడలోని బాధితులు విగ్నేశ్, నిర్మల కుటుంబాలను కలుసుకున్నారు.
అధైర్య పడొద్దు..
పులిదాడి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. దాడి వివరాలను బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇరు కుటుంబాలకు రూ.10,000 చొప్పున నగదు సాయం అందించిన ఎంపీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
అటవీశాఖ విఫలం
అటవీ అధికారులు నిర్లక్ష్యం వల్లనే అటవీ జంతువులు ప్రజలపై దాడి చేస్తున్నాయన్న ఆదిలాబాద్ ఎంపీ.. ఆదివాసీలను వెల్లగొట్టేందుకే అడవుల్లో పులులను వదిలారని ఆరోపించారు. పులిని బంధించటంలో అటవీశాఖ విఫలమైందని.. త్వరగా పులిని బంధించకుంటే తామే పట్టుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: 'పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను నెలాఖరులోపు పూర్తి చేయాలి'