హైదరాబాద్ హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అబ్దుల్ జోహార్‌ఖాన్, అబ్దుల్ ముజాహిద్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండు నెలల ఓ బిడ్డ ఉంది. అయితే ఈనెల 3న దంపతులిద్దరూ గొడవపడ్డారు. అనంతరం భర్త.. తమ బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో జోహార్ ఖాన్ తన రెండు నెలల బిడ్డను అమ్మేసింది. కాలా పత్తర్‌లోని ఓ కుటుంబానికి రూ.45 వేలకు విక్రయించింది. 8న ఇంటికి తిరిగొచ్చిన భర్త.. బిడ్డ గురించి ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ముజాహిద్ పోలీసులను ఆశ్రయించగా.. బిడ్డను సురక్షితంగా తండ్రికి అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి: 'అక్రమంగా తయారు చేసిన శానిటైజరే వారి ప్రాణాలు తీసింది'