ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామంలో ఆరు రోజుల కిందట ఓ యువతి అదృశ్యమైంది. ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లి రాణి పోలీసులను ఆశ్రయించింది. తన గారాల పట్టిని వెతికి తీసుకురావాలని ప్రాధేయపడింది.
ఆరు రోజులైనా ఆమెను తీసుకురాలేదంటూ గ్రామస్తులతో కలిసి పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. ఎస్సై అందుబాటులో లేకపోవడంతో... సీఐ మురళి.. రాణితో ఫోన్లో మాట్లాడారు. యువతిని తీసుకెళ్లిన పూజారి ప్రకాశ్ శర్మ కాల్ డేటా ఆధారంగా తాము గాలిస్తున్నామని... త్వరలోనే ఆచూకీ లభ్యమవుతుందని తెలిపారు. ఆమె తిరిగి తీసుకొస్తామని హామీ ఇవ్వడంతో రాణి ఆందోళన విరమించింది. కూతురుని తీసుకురాకుంటే పోలీస్స్టేషన్ ఎదుటనే ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించింది.
ఇదీ చూడండి: పెద్దలకు తెలిసిన ప్రేమ.. బావిలో దూకి జంట ఆత్మహత్య