ETV Bharat / jagte-raho

విషాదం: రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి - road accident in manthani

కారు డ్రైవర్​ అతివేగం.. తల్లి, కొడుకును పొట్టనబెట్టుకుంది. ఈ ఘటనతో మృతుల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండల పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

road accident, manthani, mother and son died
రోడ్డు ప్రమాదం, మంథని, తల్లీ కొడుకులు మృతి
author img

By

Published : Jan 8, 2021, 7:21 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని మండలం భట్టుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తల్లీకొడుకు మృతి చెందారు. నాగేపల్లి గ్రామానికి చెందిన డబ్బెట నరేష్​, తల్లి రాజేశ్వరి బైక్​పై మంథని వైపు వస్తుండగా.. భట్టుపల్లి కల్వర్టు సమీపంలో కాటారం వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది.

నిర్లక్ష్యంగా అతివేగంగా వెళ్తున్న కారు.. లారీని ఓవర్​టేక్​ చేయబోయి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. బైక్​పై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో వీరిని మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్​ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మంథనికి తరలించారు.

ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: దారుణ హత్య: మొండెం, తల, కాళ్లు, చేతులు వేరుచేసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.