తన భార్యా పిల్లలు ఆదివారం నుంచి కనిపించకుండా పోయారని రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామానికి చెందిన రాజు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కుటుంబ సమస్యల కారణంగా గొడవ జరిగి... పిల్లలను తీసుకుని తన భార్య రాజమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆమె భర్త రాజు తెలిపాడు. బంధువుల ఇళ్లలోను, చుట్టుపక్కల ప్రదేశాలలో ఆచూకి లభించకపోవడంతో పోలీసులని ఆశ్రయించాడు. పోలీసులు అదృశ్యం కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.