నిర్మల్ జిల్లా భైంసాలో ఆర్థిక ఇబ్బందులతో తల్లీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ కూతురుతో కలిసి స్థానిక రాంనగర్‌లో నివాసం ఉంటోంది. ఉదయం కిటికీలోనుంచి చూసిన స్థానికులకు ఉరివేసుకున్నట్లు కనిపించడం వల్ల వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
బతుకుదెరువు కోసం వారి కుటుంబం పదేళ్ల క్రితం బైంసాకు రాగా... భర్త వదిలేశాడు. భాగ్యశ్రీ కుట్టుమిషన్ శిక్షణ నేర్పించేది. ఆమె కూతురు ఇటీవలే మెడికల్ కాలేజీలో సీటు సంపాదించింది. భర్త వదిలేసి వెళ్లడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లీకూతురు ఆత్మహత్యతో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,802 కరోనా కేసులు.. 9 మరణాలు