ETV Bharat / jagte-raho

అక్రమంగా రేషన్ బియ్యం విక్రయిస్తున్న వడ్డీ వ్యాపారి అరెస్టు - రేషన్​ బియ్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

అక్రమంగా రేషన్​ బియ్యం నిల్వ చేసి విక్రయిస్తున్న కమాన్పూర్​కు చెందిన వడ్డీ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. పీడీఎస్​ బియ్యం, ప్రామిసరీ నోట్​లు, చెక్కులు స్వాధీనం చేసుకున్నట్టు గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ తెలిపారు.

money lender areest in illegal pds rice selling case in kamanpur
అక్రమంగా రేషన్ బియ్యం విక్రయిస్తున్న వడ్డీ వ్యాపారి అరెస్టు
author img

By

Published : Jun 30, 2020, 10:09 PM IST

పెద్దపల్లి జిల్లా కమాన్పూర్​కు చెందిన కోలేటి మహేశ్ అలియాస్ అప్పాల మహేశ్​ను పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలంగా రేషన్​ బియ్యాన్ని అక్రమంగా అధిక ధరలకు అమ్ముతున్నారనే సమాచారంతో... అతని ఇంటిపై సీఐ శ్రీనివాస్, శ్యాం పటేల్​ తన సిబ్బందితో దాడి చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 18 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

ఇంట్లో సోదాలు చేయగా... ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని 120 మందికి అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, చెక్కులు లభించాయి. బియ్యం, చెక్కులు, ప్రామిసరీ నోట్​లు సీజ్​ చేసినట్టు గోదావరిఖని ఏసీపీ ఉమేందర్​ తెలిపారు. అతనిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. గోదావరిఖని కేంద్రంగా వడ్డీ వ్యాపారాలు నడిపిన వారిపై గతంలోనూ ఉక్కుపాదం మోపామని, ఇలాంటి వారెవరైనా ఉంటే ప్రజలు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే శిక్ష పడేలా చూస్తామన్నారు.

ఇదీ చూడండి: నేపాల్​ ప్రధాని రాజీనామాకు సొంత పార్టీ సభ్యుల డిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.