ఓయూ విద్యార్థి సురేష్ యాదవ్.. ఎమ్మెల్యే బాల్కసుమన్ అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉస్మానియా క్యాంపస్లో భోజనం చేసి.. పడుకుంటుండగా.. రాత్రి 11.30లకు.. ఎమ్మెల్యే బాల్కసుమన్ అనుచరులు తనపై దాడి చేశారంటూ సురేష్ తెలిపాడు. సుమారు 20 మంది మారణాయుధాలతో తనను వెంబడించారని... భయంతో బయటకు వెళ్లి రీసెర్చ్ సెంటర్ వద్ద చెట్లలో దాక్కున్నట్లు వెల్లడించాడు.
తెరాస పార్టీని విమర్శిస్తే నిన్నే కాదు ఎవరినైనా చంపుతామంటూ బెదిరించినట్లు పేర్కొన్నాడు. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించినందుకే తనపై దాడి జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపాడు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని... వెంటనే వారిని అరెస్ట్ చేయాలని సురేష్ కోరుతున్నాడు.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య