సంక్రాంతి పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లేవారంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్ సూచించారు. మియాపూర్, చందానగర్, లింగంపల్లి స్టేషన్‌ల పరిధిలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
దొంగలకు అవకాశాలు కల్పించకుండా మసులుకోవాలన్నారు. ఊళ్లకు వెళ్లే హడావుడిలో నగలు, నగదు బీరువాలో ఉంచి తాళం చెవిని దానిపైనే పెట్టరాదని తెలిపారు.
''బంగారం, అభరణాలు, నగదును బ్యాంకు లాకర్‌లో దాచుకోవాలి. ఇంటికి తాళం వేసి కనిపించకుండా కర్టెన్ వేయాలి. ఇంటి చిరునామా, ఫోన్ నంబర్‌లు సమీప పోలీస్ స్టేషన్ అధికారులకు తెలుపాలి''.
-కృష్ణ ప్రసాద్, ఏసీపీ
ఇదీ చూడండి: ప్రతి ఆటోలో క్యూ ఆర్ కోడ్.. ప్రయాణికుల రక్షణే ప్రాధాన్యం