వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి... మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలం మైలార్ దేవరంపల్లి గ్రామానికి చెందిన సాయమ్మ ఈనెల 14 కోట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ వినాయక విగ్రహాల తయారీ షెడ్డులో గుర్తు తెలియని మహిళ శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు శనివారం సమాచారం ఇచ్చారు. సీఐ రాజశేఖర్ ఆనవాళ్లు సేకరించి... మృతి చెందిన మహిళ తప్పిపోయిన సాయమ్మగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ సంజీవరావు తెలిపారు.
ఇదీ చదవండి: సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి వరదలో కొట్టుకుపోయి..