రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూరులో అదృశ్యమైన అన్నాచెల్లెల్లను మహబూబ్‌నగర్ జిల్లా ఇల్లందులో పోలీసులు గుర్తించారు. అక్టోబర్ 29న కుంట్లూరుకు చెందిన శ్రీపాల్(13), ప్రేమ(11) ఇంట్లో తల్లికి చెప్పకుండా పారిపోయారు. అదృశ్యం కేసుగా నమోదు చేసుకుని నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు విశాఖపట్నం, నందిగామ రైల్వే స్టేషన్లలో గాలింపు చర్యలు చేపట్టారు.
కొద్దిరోజులుగా వారి తల్లిదండ్రులు గొడవపడగా తండ్రి ఇల్లందులో ఉండటంతో అక్కడికి వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. వారిద్దరిని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వచ్చి తల్లికి అప్పగించారు. తన పిల్లలను అప్పగించినందుకు ఆమె పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.