ETV Bharat / jagte-raho

తల్లిదండ్రుల చెంతకు.. తప్పిపోయిన బాలుడు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో తప్పిపోయి తిరుగుతున్న ఓ బాలుడిని గ్రామస్థులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. గత రెండురోజుల క్రితం తప్పిపోయిన బాలుడికి పోలీసులు రాయగిరిలోని సహృదయ అనాథాశ్రమంలో ఆశ్రయం కల్పించారు. బాలుడి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.

missing boy reached his Parents Safely in Yadadri district
తల్లిదండ్రుల చెంతకు చేరిన.. తప్పిపోయిన బాలుడు
author img

By

Published : Oct 3, 2020, 10:25 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో తప్పిపోయి తిరుగుతున్న బాలుడిని గ్రామస్థులు గుర్తించారు. బాలుడి వివరాలు తెలుసుకునేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు బాలుడిని రాయగిరిలోని సహృదయ అనాథాశ్రమంలో ఆశ్రయం కల్పించారు. బాలుడి పేరు శివ అని తెలుసుకున్న.. పోలీసులు దర్యాప్తు చేపట్టి శివ తల్లిదండ్రులది.. నల్గొండ జిల్లా కనగల్​గా గుర్తించారు. గత రెండు రోజులుగా సహృదయ అనాథాశ్రమంలో ఉన్న బాలుడిని.. భువనగిరి బాలల పరిరక్షణ విభాగానికి అప్పగించారు. అనంతరం నల్గొండ చిల్డ్రెన్స్​ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచారు.

నల్గొండ జిల్లా కనగల్​ గ్రామానికి చెందిన శ్రీను, ముత్యాలమ్మలు బాలుడి తల్లిదండ్రులుగా గుర్తించి అతడిని వారికి అప్పగించారు. సెప్టెంబర్​ 30న తప్పిపోయి.. భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో తిరుగుతుండగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్టు ఎస్సై రాఘవేందర్​ తెలిపారు. అనాజిపురం గ్రామానికి చేరుకున్న ఎస్సై బాలుడిని​ సహృదయ అశ్రమానికి తరలించారు. శివ గతంలో కూడా ఇలాగే.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చేశాడని అధికారులు, పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: ఆస్తుల విలువ నిర్ధారణ గడువులోగా పూర్తవుతుందా.. ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.