ETV Bharat / jagte-raho

కరోనా బాధితురాలితో అసభ్య ప్రవర్తన... ఆలస్యంగా వెలుగులోకి - Gandhi Hospital news

సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలిపై వార్డుబాయ్ అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడే పనిచేస్తున్న ఓ వైద్యుడు అతన్ని పట్టుకోగా... ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి యాజమాన్యం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అక్కడ మహిళా కార్మికులు ఆరోపించారు.

Misbehave With Corona Patient In Gandhi Hospital
కరోనా బాధితురాలితో అసభ్య ప్రవర్తన...ఆలస్యంగా వెలుగులోకి
author img

By

Published : Oct 2, 2020, 2:38 PM IST

కరోనా బాధితురాలిపై వార్డుబాయ్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత నెల 2న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఆరో అంతస్తులో విధులు నిర్వహించే సమయంలో మహిళతో అనుచితంగా ప్రవర్తించాడు. అక్కడే విధుల్లో వైద్యుడు అతన్ని పట్టుకుని ఆస్పత్రి యాజమాన్యానికి అప్పగించారు.

అయినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అక్కడ పనిచేసే మహిళా కార్మికులు ఆరోపిస్తున్నారు. అదే ఆస్పత్రిలో యూనియన్ నాయకుడు కావడంతో కేవలం మందలించి వదిలేశారని ఫిర్యాదు చేశారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:సైబర్ క్రైం: గిఫ్ట్ వచ్చిందన్నారు... 16లక్షలు కాజేశారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.