బాలికకు వృద్ధుడితో వివాహం జరిపించిన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అబ్దుల్ లతీఫ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అత్యాచారం, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న ఫలక్‌నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తీగలకుంటకు చెందిన 16 సంవత్సరాల మైనర్‌కు కేరళకు చెందిన 58 సంవత్సరాల వృద్ధుడు అబ్దుల్ లతీఫ్ పరాంబన్‌తో ఈ నెల 27న వివాహం జరిగింది. బాలిక పిన్ని హూర్ ఉన్నీసా, ఆమె బంధువులు మీర్ రహ్మతుల్లా, అబ్దుల్ రహ్మాన్‌తో పాటు దళారీలు వసీం ఖాన్, ఖాజీ, బదీయుద్దీన్ ఖాద్రీ కలిసి ఈ నెల 27న పెళ్లి జరిపించారు. బాలికను వివాహం చేసుకున్న అబ్దుల్ లతీఫ్ ఆమెపై లైంగిక దాడి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బాలిక సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్.. పోలీసుల చెక్!