వాగులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మొండ్రాయిగూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సిద్ధబోయిన వీరస్వామి మతి స్థిమితం లేని యువకుడు రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
జాడ కనిపించలేదు...
అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు గ్రామంలో వెతకగా జాడ కనిపించలేదు. ఆదివారం గ్రామ శివారులోని వాగులో మృతదేహం కనిపించడం వల్ల వాగులో నుంచి బయటకు తీశారు.
ఇవీ చూడండి : 'నిజమైన నిరుపేదలను గుర్తించి ఇళ్లను ఇస్తున్నాం'