భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో ముగ్గురు మావోయిస్టు మిలిషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. చర్ల మండలంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు తనిఖీలు చేస్తుండగా పదమిడి సీలేరు వద్ద పోలీసులను చూసి పారిపాయేందుకు యత్నించగా వెంబడించి పట్టుకున్నారు.
బత్తణపల్లికి చెందిన బీమరాజు, నాగేశ్వరావు, పెంటయ్యలుగా గుర్తించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేసిన కేసుల్లో వీరు ఉన్నట్లు తెలిపారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో కరపత్రాలు వేసేందుకు వెళ్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
ఇవీచూడండి: ఏడుగురు మావోయిస్టు మిలిషీయా సభ్యుల లొంగుబాటు