ETV Bharat / jagte-raho

కెమికల్ ట్యాంకర్​ను ఢీ కొట్టిన కారు - ధర్మోజి గూడెం వద్ద రోడ్డు ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మోజి గూడెం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న హైడ్రోక్లోరిక్ ఆమ్లం లోడ్​తో ఉన్న ట్యాంకర్​ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ​

maruthi car, road accident, dharmoji gudem
మారుతి కారు, రోడ్డు ప్రమాదం, ధర్మోజి గూడెం
author img

By

Published : Jan 10, 2021, 12:41 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండలం ధర్మోజి గూడెం వద్ద హైడ్రోక్లోరిక్​ ఆమ్లం లోడ్​తో ఉన్న ట్యాంకర్​ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్​ కాళ్లు కోల్పోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఏపీలోని రాజమండ్రి పాగ్గొండ నుంచి హైదరాబాద్ బొల్లారంనకు హెచ్​సీఎల్​ లోడ్​తో వెళ్తున్న ట్యాంకర్​.. ధర్మోజి గూడెం వద్ద అకస్మాత్తుగా పంక్చర్​ అయింది. మరమ్మతుల కోసం డ్రైవర్​ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపాడు. ఆ సమయంలో వెనకనుంచి వస్తున్న కారు.. ట్యాంకర్​ను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ట్యాంకర్​లో నుంచి యాసిడ్​ బయటకు వచ్చి రోడ్డుపై పొగ కమ్ముకుంది. ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వాహనాన్ని ఖాళీ స్థలంలో నిలిపించారు. ​

ఇదీ చదవండి: ఓఆర్​ఆర్​పై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.