పెళ్లైన ఆరు నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వరంగల్‌కు చెందిన శబరిష్‌కు కరీంనగర్‌కు చెందిన శ్రీ విద్యతో ఆరునెలల క్రితం వివాహమైంది. భర్త పని మీద బెంగళూర్ వెళ్లడంతో... శ్రీవిద్య చందానగర్‌లోని వారి కుటుంబసభ్యుల ఇంటికి వెళ్లింది.
శనివారం మధ్యాహ్నం భర్త శబరిష్‌తో ఫోన్లో మాట్లాడిన ఆమె... అతనితో గొడవపడి భవనంపై నుంచి కిందకు దూకేసింది. తీవ్ర గాయాలపాలైన శ్రీవిద్యను కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ... శ్రీవిద్య ఆదివారం మృతి చెందింది.
భార్య మృతికి... శబరిష్ వేధింపులే కారణమని శ్రీవిద్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆమె ఇంటిముందు మృతదేహం.. చనిపోయాడా, చంపేశారా?