ETV Bharat / jagte-raho

అత్తింటి నుంచి వివాహిత అదృశ్యం.. పోలీసులకు భర్త ఫిర్యాదు

అత్త వారి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైంది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

author img

By

Published : Sep 18, 2020, 12:34 PM IST

అత్తింటి నుంచి వివాహిత అదృశ్యం.. పోలీసులకు భర్త ఫిర్యాదు
అత్తింటి నుంచి వివాహిత అదృశ్యం.. పోలీసులకు భర్త ఫిర్యాదు

అత్తింటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైన సంఘటన హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మెహిదీపట్నం మహేళ్ నగర్​కు చెందిన ప్రియాంక ఇటీవలే అనారోగ్యానికి గురైంది. ఈ క్రమంలో బర్కత్​పురాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది వారం క్రితమే డిశ్చార్జీ అయ్యింది.

ఆందోళనలో కుటుంబం..

రామ్ కోఠిలోని జైన్ మందిర్ వద్ద భర్తతో కలిసి తన అత్తింటిలో ఉండేది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రియాంక తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలి అత్తమ్మ మిగతా కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఫలితంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపులు చేపట్టినా నిష్ప్రయోజనమే ఎదురైంది.

భర్త ఫిర్యాదు..

ఈ నేపథ్యంలో ప్రియాంక భర్త రేణుదాస్ సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ప్రియాంక వాట్సాప్ మెసేజ్​లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఇవీ చూడండి : నిరాడంబరంగా బతుకమ్మ ఆట.. కరోనాతో తగ్గిన సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.