ETV Bharat / jagte-raho

ఇద్దరు వ్యక్తులు అరెస్టు... 24 కిలోల గంజాయి పట్టివేత - marijuana seized in mangal hat in hyderabad

హైదరాబాద్​ మంగళ్​హాట్​ పరిధిలో అక్రమంగా నిషేధిత గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను వెస్టుజోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

marijuana seized in mangalhat hyderabad
ఇద్దరు వ్యక్తులు అరెస్టు... 24 కిలోల గంజాయి పట్టివేత
author img

By

Published : Sep 29, 2020, 7:36 PM IST

హైదరాబాద్ మంగళ్​హాట్ పోలీస్​స్టేషన్ పరిధిలోని బలరాం గల్లీలో గంజాయి అమ్ముతున్నారన్న కచ్చితమైన సమాచారం మేరకు వెస్ట్​జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. హజరి హోటల్, అప్పర్ దూల్పేట్ వద్ద గంజాయిని విక్రయిస్తున్న నర్సింగ్, దుర్గేశ్​లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

వృత్తిరీత్యా నర్సింగ్ కార్పెంటర్ పని చేస్తాడని తనకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే ఉండడం వల్ల ఈ వక్రమార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. విశాఖపట్నం నుంచి 7 వేలకు రెండు కేజీలలెక్క తెచ్చి అవసరం ఉన్నవారికి 10 నుంచి 12 వేల రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్పారు. కస్టమర్లకు గంజాయ్ అందించడానికి తన మేనల్లుడైన దుర్గేశ్​ను పనిలో పెట్టుకున్నట్టు వెల్లడించారు. వీరిరువురిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఈ దొంగలు ఏకంగా జవాన్ల అవతారమెత్తి మోసగిస్తున్నారు : సజ్జనార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.