తెలంగాణ - ఛత్తీస్ గఢ్ అటవీ సరిహద్దు ప్రాంతంలోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో రూ. లక్ష రివార్డు ఉన్న ఓ మావోయిస్టు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అవుటపల్లి ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనాస్థలిలో తుపాకీ, మందుపాతర తయారీకి వాడే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టును వికేశ్ హేమ్లాగా పోలీసులు గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులకు గాయాలపాలై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉగ్రరూపం.. జూరాల ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తివేత