సంగారెడ్డి జిల్లా కేంద్రంంలోని మహబూబ్‌సాగర్ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.
మృతుడు సంగారెడ్డి మండల పరిధిలోని కులబ్గూర్ గ్రామానికి చెందిన పాపయ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పాపయ్య మృతదేహాన్ని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
- ఇదీ చూడండి : డివైడర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం... ఒకరు మృతి