ETV Bharat / jagte-raho

ప్రేమంటూ తిరిగాడు... ఒప్పుకోలేదని చంపేశాడు.. - ప్రేమించలేదని విజయవాడలో ఉన్మాది ఘాతుకం

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా.. మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో యాసిడ్ దాడులతో విరుచుకుపడిన ఉన్మాదులు.. ఇప్పుడు ఆటవికంగా కత్తులు పట్టుకుంటున్నారు. ప్రేమించకపోతే చంపేయడానికీ వెనకాడటం లేదు. ఏపీలోని కృష్ణాజిల్లా విజయవాడలో జరిగిన దారుణ ఘటన.. మహిళల భద్రతకు ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. దివ్య అనే ఇంజనీరింగ్ విద్యార్థిపై విరుచుకుపడిన ప్రేమోన్మాది.. ఆమెను చంపేశాడు.

maniac-attack-on-engineering-student-in-vijayawada
ప్రేమంటూ తిరిగాడు... ఒప్పుకోలేదని చంపేశాడు..
author img

By

Published : Oct 15, 2020, 3:34 PM IST

ప్రేమంటూ తిరిగాడు.. కాదన్నందుకు కక్ష పెంచుకున్నాడు. అదును చూసి చంపేశాడు. ఆంధ్రప్రదేశ్​ విజయవాడలోని క్రీస్తు రాజపురానికి చెందిన దివ్య తేజస్విని అనే యువతి ఇంజనీరింగ్ చదువుతోంది. స్వామి అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమె వెంట తిరిగాడు. ఆమె అంగీకరించకపోయేసరికి... కత్తితో దాడి చేశాడు. మెడపై పొడిచిన స్వామి తర్వాత తనను తాను గాయపరుచుకున్నాడు.

మార్గమధ్యలోనే..

స్వామి దాడిలో తీవ్రంగా గాయపడిన దివ్యను స్థానిక ప్రభుత్వాసుపత్రికి మొదట తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడం వల్ల ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. తరలిస్తుండగానే మార్గ మధ్యలో దివ్య కన్నుమూసింది.

యువతి ఇంటికి వెళ్లి..

నేరుగా యువతి ఇంటికే వెళ్లి దివ్యను స్వామి దాడి చేశాడు. ఈ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి: పానీపూరీ తినేందుకు వెళ్లి గల్లంతైన యువకులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.