ETV Bharat / jagte-raho

ఇద్దరు దొంగల అరెస్ట్​.. నగదు, బంగారం స్వాధీనం - two robbers are arreted

నగరంలోని ఇళ్లలో చోరీలకు పాల్పడుతోన్న రాజస్థాన్​కు చెందిన ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

Mangalhat police arrested two robbers
ఇద్దరు దొంగల అరెస్ట్​.. నగదు, బంగారం స్వాధీనం
author img

By

Published : Dec 10, 2020, 5:30 AM IST

జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతోన్న మనోహర్​ కుమార్​, విజయ్​ కుమార్​ అనే ఇద్దరు దొంగలను మంగళ్​హాట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.20 లక్షల నగదు, 4.25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఏం జరిగిందంటే..

అఘాపురాలో నివాసం ఉంటున్న సురేశ్​ భాటి అనే వ్యక్తి ఇంట్లో ఈ నెల 4న చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సురేశ్​​ ఇంటికి వచ్చే సరికి బీరువా తెరిచి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

సీసీ పుటేజీల ద్వారా చోరీకి పాల్పడిన మనోహర్​ కుమార్​ కెమవత్​, విజయ్​కుమార్​ కెమవత్​ అనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఏసీపీ నరేందర్​రెడ్డి తెలిపారు. వీరిద్దరు రాజస్థాన్​ రాష్ట్రానికి చెందిన వారిగా వివరించారు.

ఇదీ చూడండి: లైంగిక దాడి కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల కారాగారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.