నకిలీ విలేకరులను మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ తెలుగు ఛానల్ ప్రతినిధులుగా చలామణి అవుతూ... మహిళా యాంకర్లు కావాలని ఇంటర్వ్యూ పేరట డబ్బులను వసూలు చేశారు. దీంతో మోసపోయిన యువతులు స్థానికంగా ఉన్న ఛానల్ ప్రతినిధికి సమాచారం ఇవ్వడంతో... ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఛానల్ ప్రతినిధి ఫిర్యాదు మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు నకిలీ విలేకరులను పట్టుకున్నారు. జనగామకు చెందిన సంపత్ రెడ్డి, హైదరాబాద్ లోతుకుంటకు చెందిన వెంకట్రావులను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: వందేళ్ల చరిత్ర.. ఏదీ భద్రత?