సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మరణించాడు. గ్రామానికి చెందిన షేక్ హమీద్(38) అనే యువకుడు గ్రామంలో విద్యుత్‌కు సంబంధించి తాత్కాలికంగా పనులు చేసేవారు. స్థానికుల అవసరాల కోసం స్తంభం ఎక్కి విద్యుత్ సమస్యలు పరిష్కరించేవాడు.
మంగళవారం ఉదయం గ్రామంలో కరెంట్ లేని చోట మరమ్మతులు చేయడానికి వెళ్లగా.. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అంది. హమీద్ కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మరణించాడు. మృతుని కుమారుడు ఇస్మాయిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండిః చేపలకు వెళ్లి చెరువులో పడి ఇద్దరు మృతి