ETV Bharat / jagte-raho

ఆర్టీసీ బస్సు ఢీకొట్టి వ్యక్తి అక్కడికక్కడే మృతి - Man died in Warangal depot bus collision

దేవరకద్ర మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్​పై కేసు నమోదు చేశారు.

man was died on the spot when the bus collided
బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి
author img

By

Published : Jan 12, 2021, 4:30 PM IST

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మీనుగోనుపల్లికి చెందిన బుడగ జంగాల మన్యంకొండ (48) అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

వెనక నుంచి వచ్చి..

పనులు ముగించుకుని గ్రామానికి వెళ్తుండగా ఆంధ్ర బ్యాంకు వద్ద వెనక నుంచి వచ్చిన ఆర్టీసీ వరంగల్ డిపో బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై భగవంతు రెడ్డి.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ సంజీవ్​పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడుకి భార్య, పిల్లలు ఉన్నారు. అతని మరణంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

ఇదీ చూడండి: సొంత ఖర్చుతో అంబులెన్స్​లు సమకూర్చిన నామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.