సూర్యాపేట జిల్లా మేల్లచెర్వు మండలం రేవూరులో... ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ఓ సిమెంట్ కర్మాగార యాజమాన్యంతో... ఆంజనేయులుకు భూమి విషయంలో వివాదం ఏర్పడింది. దీంతో ఆంజనేయులుపై యాజమాన్యం పోలీసు స్టేషన్లో కేసు పెట్టాడు. ఆంజనేయులును ఎస్సై స్టేషన్కు పిలిపించాడు.
అవమానంగా భావించి... తన ఆత్మహత్యకు ఎస్సై, సిమెంట్ కంపెనీ యాజమాన్యమే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగాడు. హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా... అప్పటికే పరిస్థితి విషమించింది. దీంతో ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇదీ చూడండి: కరోనా సోకిందని యువకుడి ఆత్మహత్య