ETV Bharat / jagte-raho

ఆర్థిక ఇబ్బందులతో.. వ్యక్తి ఆత్మహత్య! - లంగర్​ హౌజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధి

ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన లంగర్​ హౌజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తాను పనిచేసే ఎలక్ట్రిక్​ దుకాణంలో మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Man Suicide In Langar house Area
ఆర్థిక ఇబ్బందులతో.. వ్యక్తి ఆత్మహత్య!
author img

By

Published : Aug 29, 2020, 9:17 AM IST

లంగర్​హౌజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గోల్కొండకు చెందిన మోజం హుస్సే​న్​ తాను పని చేసే న్యూ విన్నర్​ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో వైరుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే హుస్సేన్​ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.