సంగారెడ్డి జిల్లా కంది మండలం చర్లగూడెం గ్రామానికి చెందిన రాజిరెడ్డి భార్యా, ఇద్దరు పిల్లలతో అతని కుటుంబం ఆనందంగా ఉండేది. అయితే పదేళ్ల క్రితం అతని భార్య కవిత అనారోగ్యంతో చనిపోయింది. అయినా పిల్లలు ఇద్దరినీ పెంచిపెద్ద చేశాడు. కూతురు స్వప్నకు పెళ్లి చేసి పంపించాడు. కొన్నేళ్ల తర్వాత అనూహ్యంగా కుమారుడు రజినీకాంత్రెడ్డికి మతిస్థిమితం కోల్పోయి ఎక్కడ ఉంటాడో తెలీని పరిస్థితి ఏర్పడింది.
ఈ మేరకు గత కొంతకాలంగా పాశమైలారం పారిశ్రామికవాడ సమీపంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీలకు రహదారిపై గైడ్‌గా రాజిరెడ్డి పని చేస్తున్నాడు. ఒంటరి అనుకున్నప్పుడల్లా అప్పడప్పుడు ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీలో ఉన్న సోదరి స్వరూప ఇంటి అరుగుపై పడుకుని వెళ్లిపోయేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న తన వెంట తెచ్చుకున్న డీజిల్‌తో సోదరి ఇంటి సమీపంలోనే ఆత్మహత్యకు యత్నించాడు. అతన్ని గుర్తించి స్నేహితుడు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ రాజిరెడ్డి మంగళవారం మరణించగా.. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండిః ప్రముఖుల వాట్సాప్ హ్యాక్!.. పోలీసులు ఏం చెప్పారంటే..