నిజమాబాద్ జిల్లా గూపన్పల్లిలో సోమవారం అన్వర్, సయ్యద్ యూసుఫ్ కలిసి మద్యం సేవిస్తుండగా మద్యం మత్తులో గణేష్ అనే వ్యక్తి వచ్చి తనకు మందు పోయమని గొడవ చేశాడని పోలీసులు తెలిపారు.
మంగళవారం ఉదయం మళ్లీ గణేష్, అన్వర్ మద్యం కోసం గొడవ పడుతుండగా సయ్యద్ యూసుఫ్ సర్ది చెప్పేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో సయ్యద్ తలపై గణేష్ బలంగా కొట్టగా అతను అక్కడికక్కడే మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండిః హైదరాబాద్లో కొనసాగుతోన్న వరుణుడి ప్రతాపం