ETV Bharat / jagte-raho

హుస్నాబాద్​లో లారీ ఢీకొని వ్యక్తి మృతి - సిద్దిపేట నేర వార్తలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో లారీ ఢీకొని ఏపీ వాసి మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

హుస్నాబాద్ లో లారీ ఢీకొని వ్యక్తి మృతి
హుస్నాబాద్ లో లారీ ఢీకొని వ్యక్తి మృతి
author img

By

Published : Oct 11, 2020, 7:44 AM IST

లారీ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కొండసముద్రం గ్రామానికి చెందిన తాటిపర్తి చంద్రమౌళి తాపీ మేస్త్రి. కరీంనగర్ లో ఉంటూ కూలి పనిచేసుకుని బతుకుతుండే వాడు.

ఈ క్రమంలో మీర్జాపూర్ కు చెందిన ఓ గిరిజన వివాహిత మహిళతో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఆ మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉండగా వారిని వదిలేసి తనను వివాహం చేసుకోవాలని చంద్రమౌళి బలవంత పెట్టినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సదరు మహిళ కుటుంబ సభ్యులు శనివారం ఉదయం చంద్రమౌళిపై పట్టణంలోని నాగారం రోడ్ లో దాడి చేశారు.

భయంతో పరుగులు తీసిన చంద్రమౌళి చూసుకోకుండా లారీ కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న చంద్రమౌళి 108 వచ్చేలోపే అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'రాష్ట్రంలో మొక్కజొన్న సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.